వంగర(శ్రీకాకుళం), న్యూస్‌లైన్: వంగర మండలం లక్ష్మీపేటలో ఇటీవల జరిగిన దళితులపై జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తరఫున పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పీఎంజే బాబు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులను కలిసి రూ.లక్ష వంతున చెక్కులు అందజేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన బూరాడ సుందరరావు, చిత్తిరి అప్పడు, నివర్తి వెంకటి, నివర్తి సంగమేశుల కుటుంబీకులకు ఈ సాయమందించారు. రెండు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో మరణించిన బి.పాపయ్య కుటుంబానికి కూడా ఈ సాయం అందిస్తామని పీఎంజే బాబు తెలిపారు.
Friday, 22 June 2012
లక్ష్మీపేట బాధితులకు వైఎస్సార్ సీపీ చేయూత
వంగర(శ్రీకాకుళం), న్యూస్‌లైన్: వంగర మండలం లక్ష్మీపేటలో ఇటీవల జరిగిన దళితులపై జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తరఫున పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పీఎంజే బాబు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులను కలిసి రూ.లక్ష వంతున చెక్కులు అందజేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన బూరాడ సుందరరావు, చిత్తిరి అప్పడు, నివర్తి వెంకటి, నివర్తి సంగమేశుల కుటుంబీకులకు ఈ సాయమందించారు. రెండు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో మరణించిన బి.పాపయ్య కుటుంబానికి కూడా ఈ సాయం అందిస్తామని పీఎంజే బాబు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment