అసెంబ్లీ చరిత్రలోనే నేడు చీకటి రోజు అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే తమపై జులం ప్రదర్శించటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరు చూస్తే నియంతల పాలనలో ఉన్నమా అనిపించిందన్నారు. ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఎదుర్కొనలేక.. భౌతికంగా అంతమెందించేందుకు కుట్రజరుగుతోందా అన్న అనుమానం వస్తోందన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, గవర్నర్ నరసింహన్ లు ఇప్పటికైనా ఆలోచించాలని ఆయన సూచించారు.
చంద్రబాల -జేడీ లక్ష్మినారాయణల మధ్య వున్న సంబందం మాకు అవసరం లేదు.. కాని చంద్రబాలతో వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకులు మాట్లాడటం చూస్తే... విచారణ తీరుపై పలు అనుమానం కలుగుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విడుదల చేసిన కాల్‌లిస్ట్‌కు సంబందించి అన్ని ఆధారాలు తమ దగ్గరవున్నాయని.. త్వరలోనే బయటపెడతామన్నారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడటాన్ని మేం తప్పు పట్టడంలేదని... యాజమాన్యాలతో మాట్లాడటంపైనే మేం ప్రశ్నిస్తున్నామన్నారు. ఐపీఎస్ అధికారి జే వి రాముడుతో చంద్రబాల మాట్లాడినట్లు స్పష్టమైన సాక్షాలు వున్నాయని.. వీటిని బట్టి చంద్రబాలతో తమ వ్యతిరేకులకు సంబంధ వున్నట్లు రుజువయ్యిందని తాము భావిస్తున్నామని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు.

No comments:
Post a Comment