కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలసి వైఎస్ జగన్‌పై మహాకుట్రకు తెరతీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో ఎన్నో ప్రజాసమస్యలు ఉన్నప్పటికీ అవేమీ పాలక, ప్రతిపక్షాలకు పట్టడం లేదని ఆపార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. జగన్ పై అక్రమ కేసులను నిరసిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సత్యాగ్రహం చేపట్టారు.
పోలీసులు అరెస్ట్‌కు ప్రయత్నించగా ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రతిఘటించారు. దాంతో పోలీసులు అరెస్ట్‌ను విరమించుకున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం సత్యగ్రహదీక్ష కొనసాగుతోంది

No comments:
Post a Comment