వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ ను చంచల్ గూడ జైలులో మంత్రి విశ్వరూప్ కుమారుడు కలవడం చర్చనీయాంశం అవుతోంది.ఆయనే కాకుండా దివంగత నేత పి.జనార్దనరెడ్డి కుమార్తె విజయ కూడా కలిశారు.ప్రజల హృదయాలనుంచి వచ్చిన నేతలు పిజెఆర్, వై.ఎస్. లని కూడా ఆమె వ్యాఖ్యానించడం విశేషం. పిజెఆర్,వైఎస్ ల కు మద్య రాజకీయంగా సత్సంబందాలు ఉండేవికావు. అయినా ఆయన కుమార్తె జైలుకు వచ్చి జగన్ ను కలవడం విశేషం.విచిత్రంగా గతంలో వై.ఎస్. అంటే అంత సఖ్యత లేని నేతలో, వారి పిల్లలో జగన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా మంత్రి విశ్వరూప్ కుమారుడు జగన్ ను కలవడం ఆశ్చర్యం కాదు. గతంలోనుంచి ఈయన జగన్ మద్దతుదారుగా ఉన్నారు.ఆయనతోపాటు మరికొందరు మంత్రుల పిల్లలు కూడా గతంలో జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు.కోమటిరెడ్డి సోదరులు కూడా జగన్ కు సన్నిహితులన్న అభిప్రాయం ఉంది.వీరికి రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోమటిరెడ్డి సోదరులు పార్టీలో ఉండబోరని కూడా పాల్వాయి చెబుతున్నారు.ఇలా కాంగ్రెస్ లో తగాదాలు కూడా జగన్ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది. |
Wednesday, 20 June 2012
జగన్ ను కలిసిన మంత్రి కుమారుడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment