రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ఎన్నికలు జరిగినా క్లీన్ స్వీప్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న నమ్మకానికి మొన్నటి ఉపఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆపార్టీ తరపున నెల్లూరు నుంచి ఎంపీగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికైన వారంతా బుధవారం ఉదయం ఇడుపులపాయలో మహానేత సమాధిని సందర్శించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెంటరాగా ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సమాధిపై పుష్పమాలలు వేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ఇడుపులపాయ సమాధి ప్రాంగణం సందడిగా మారింది.
జోహార్ వైఎస్ఆర్, జగన్ నాయకత్వం వర్థిల్లాలి అనే నినాదాలతో సమాధి స్థలి మార్మోగిపోయింది. ఉపఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా రేపు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది.

No comments:
Post a Comment