అన్ని రంగాల్లోనూ విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడితే...ప్రభుత్వం కూలిపోడానికి తాము సహకరించమని చంద్రబాబు నాయుడు తాజాగా స్పష్టం చేశారు.ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు తన మనసులోని భావాలను బయట పెట్టారు.
ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో రహస్య స్నేహానికే మొగ్గు చూపుతున్నారు.పార్టీ క్యాడర్ మాత్రం కాంగ్రెస్ తో కుమ్మక్కై ...జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేయడం వల్లనే పార్టీ ఓడిందని అంటున్నారు.అయితే బాబు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకూడదనే కోరుకుంటున్నారు.
నిజానికి గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి ఉంటే కిరణ్ సర్కార్ కూలిపోయి ఉండేది.సర్కార్ ప్రజావ్యతిరేక పాలన అందిస్తోందని విమర్శించే చంద్రబాబు మాత్రం అవిశ్వాస తీర్మానానికి ముందుకు రాలేదు.తీరా ప్రజారాజ్యం పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక కాంగ్రెస్ కు అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ వచ్చింది.అపుడిక ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవని బేరీజు వేసుకున్నాకనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం చేశారు.రైతులకు మద్దతుగా అప్పుడే వై.ఎస్.అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి పదవులును త్యాగం చేశారు.వారినే ఇపుడు ఉప ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు.
ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నేపథ్యంలో కాంగ్రెస్..టిడిపిలనుంచి భారీ ఎత్తున వలసలు ఉండవచ్చునని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.అదే జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే నని వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంగ్ల దిన పత్రిక డెక్కన్ క్రానికల్ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు తన మనోగతాన్ని చాటి చెప్పారు.కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ పార్టీ అయినా అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము సహకరించమని తీర్మానానికి వ్యతిరేకంగానే ఓటేస్తామని బాబు అన్నారు.కిరణ్ సర్కార్ తనంతట తానుగా పడిపోయి ఎన్నికలు అనివార్యమైతే ఫరవాలేదని ఆయన సెలవిచ్చారు.అవిశ్వాసంతో మధ్యంతర ఎన్నికలకు తాము సిద్ధంగా లేమన్నారు.పదే పదే ఉప ఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కోడానికి తమ దగ్గర డబ్బులు లేవని బీద అరుపులు అరిచిన చంద్రబాబు ...ప్రతిపక్ష పార్టీగా తమకు ఎన్నికల్లో ఖర్చుచేయడానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని నిలదీశారు.మరి అధికారంలో ఉండి ఉంటే ఉప ఎన్నికలను ఎదుర్కోడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. . అసలు ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉంటే డబ్బులు వరదలా వచ్చిపడతాయా? అలా వరదలా ప్రవహించే నిధులు ఎందుకు వస్తాయి? ఆ నిధులిచ్చేవారికి పాలక పక్షం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి మరియు ఎనిమిదేళ్ళ ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబే చెప్పాలి.అలా వస్తే ఆ నిధులు క్విడ్ ప్రోకో ఖాతాలోకి వస్తాయా అన్నది కూడా ఆయనే చెప్పాలి.
ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైనందున..ఆ పదవిలో కొనసాగే అర్హతను తెలుగుదేశంపార్టీ..పోగొట్టుకుందని..వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తున్నారు.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో దివాళా తీసిన కాంగ్రెస్ పెద్దలకు చంద్రబాబు నిర్ణయం మాత్రం తొలకరి వానలా హాయిగా అనిపిస్తూ ఉండవచ్చు.కానీ టిడిపి శ్రేణులు మాత్రం తమ నేత నిర్ణయాన్ని చూసి ఇక తమ పార్టీలో అల్పపీడన ద్రోణి తప్పదని భయపడుతున్నారు.

No comments:
Post a Comment