YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 20 June 2012

జాతీయ రాజకీయాలలో జగన్‌ అంకం మొదలు కానుందా?

NewsListandDetails

ఏలూరిపాటి
జగన్‌ మద్దతు ఎవరికి?
జగన్‌ ఓటు హక్కు మాటేంటి?
జగన్‌ దగ్గర ఎన్ని ఓట్లున్నాయి?
విప్‌లేమి వల్ల ఎవరికి లాభం?

హైదరాబాద్‌: జాతీయ రాజకీయాలలో జగన్‌ అంకం మొదలు కానుందా? అంటే అవుననే నిపుణులు అంటున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జగన్‌ మద్దతు కీలకం కాబోతోంది. బొటాబొటి మెజారిటీ కూడా లేని కాంగ్రెస్‌కు ప్రస్తుతం జగన్‌ వర్గాన్ని మచ్చిక చేసుకోవడం అత్యవసరంగా మారింది. అటు జగన్‌ పార్టీ కూడా కాబోయే ప్రస్తుత తరుణంలో కేంద్ర రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తోంది. కాకపోతే, విపక్షాల అనైక్యత కొంచెం ఇబ్బందికి గురిచేస్తోంది. కాంగ్రెషస్‌ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు పోటీ నిలబెట్టడంలోని లాభనష్టాలను బేరీజు విపక్షాలు వేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వారు, అధికారంలోకి రాబోతున్నామని ఆశించేవారు కాబోయే రాష్ట్రపతి ఎవరో ముందుగా గ్రహించి ఈ దశలోనే ప్రసన్నంచేసుకోవాలని చూస్తున్నారు. కలాం తన అభ్యర్థిత్వానికి ఈ క్షణం వరకు అంగీకరించకపోవడం, సంగ్మాకు కొంతమంది కాళ్లు అడ్డుతుండడం, బీజేపీ కాబోయే రాష్ట్రపతి ప్రసన్నంపై చూపు పెట్టడం, వామపక్షాలు మమతా పాలనకు చెరమగీతం పాడాలని వేచిఉండడంతో కేంద్రంలోని రాజకీయాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు అంటూ జరిగితే కౌరవపాండవులు పెనగుకాలం తప్పదు. ఈ దశలో జగన్‌ కింగ్‌మేకర్‌ అవుతారు అని నిస్సందేహంగా పరిశీలకులు అంటున్నారు. దీనికి సరైన కారణాలు చూపుతున్నారు. ఇప్పటి వరకు జగన్‌ అంటే ఇష్టం ఉండి ఊగిసలాట ధోరణిలో ఉన్న వారు పార్టీని వీడకుండా, మంత్రిపదవులు, ఎమ్మెల్యే పదవులు పోకుండా జగన్‌ను ప్రసన్నం చేసుకునే అవకాశం రాష్ట్ర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వచ్చింది. దీనికి రాష్ట్రపతి ఎన్నికలు రంగస్థలం కానున్నాయి అని పరిశీలకులు అంటున్నారు.  సాధారణ ఎన్నికలకు రాశ్ట్రపతి ఎన్నికలకు తేడా ఉంది. ఇక్కడ ఒక ఎంపి ఓటు దాదాపు 708 ఓట్లతో సమానం. అంటే జగన్‌ ఒక ఓటు వేస్తే 708 ఓట్లు వేసినట్లే. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే వైఎస్సార్‌సి తరఫున గెలిచారు. కనుక మరో 708 ఓట్లు ఉన్నాయి. అనకాపల్లి ఎంపి సబ్బం హరి బాహాటంగా కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఎదిరిస్తున్నారు. కనుకు ఆయన కూడా వైఎస్సార్‌సి సూచించిన వ్యక్తికే ఓటు వేస్తారు. ఈ విధంగా ఓటు వేసినా కాంగ్రెస్‌ పార్టీ ఏమీ చెయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. దీనికి చట్టమే కారణం. ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అంశం. రాశ్ట్రపతి ఎన్నికలను రాశ్ట్రపతి, ఉపరాశ్ట్రపతి ఎన్నికల చట్టం 1952 ద్వారా నిర్వహిస్తారు. దీన్ని అమలుకోసం రాశ్ట్రపతి, ఉపరాశ్ట్రపతి ఎన్నికల నిబంధనలు,1974 వచ్చింది. ఇదే ఎన్నికల సంఘానికి అతి ముఖ్యమైన బెబిల్‌, గీత, ఖురాను వంటిది. దీన్ని బట్టే ఎన్నికల సంఘం రాశ్ట్రపతి ఎన్నికలు నిర్వర్తిస్తుంది. వాస్తవానికి ఫిరాయింపుల చట్టం 1985లో వచ్చింది. కానీ, నిబంధనలు లేక చట్టాన్ని ఫిరాయింపు చట్టం అనుగుణంగా సవరించలేదు. ఆ కారణం చేత ఏ ఎంపి అయినా, ఎమ్మెల్యే అయినా గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఫిరాయింపుల చట్టం అడ్డురాదు. వారిని ఏమీ చేయలేరు. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి. వారిని ఓటు వేయకుండా ఆపలేరు. ఇది ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ను, టిడిపిని, బలహీనంగా ఉన్న ఇతర పార్టీలను జగన్‌ దెబ్బకొట్టతగిన అంశం. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటింగు చేసే ప్రతిసారి పార్టీలు విప్‌ జారీ చేస్తాయి. దీనికి వ్యతిరేకంగా ఓటింగు చేస్తే వారి పదవులు పోతాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసే అవకాశం లేదు. చట్టసభలకు సంబంధం ఉన్నా చట్టసభల ఓటింగుకు ఇది దూరం, పైగా మరో చట్టం ద్వారా జరుగుతున్న ఎన్నికలు కనుక, ఆ చట్టంలో విప్‌ సంగతి లేదు కనుక పార్టీ సూచనలకు, అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి తమ మనస్సాక్షిగా వేశాము అంటే ఏ పార్టీ ఏం చేయలేదు. అసలు ఎవరు ఎవరికి ఓట్లు వేశారో కూడా కనుక్కోలేరు. ఎందుకంటే ఇక్కడ సాధార ఎన్నికల మాదిరిగా రహస్య బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. ఇటువంటి సందర్భంలో పార్టీలు ఏ అధికారంలేని సామాన్య సూచన మాత్రమే తమ ఎంపిలకు, ఎమ్మెల్యేలకు చేసి ఎవరికి ఓటు వేయాలో చెప్పగలవు. ఇదే జగన్‌కు కలిసివచ్చే అవకాశం. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే అంశం. అన్నిటికి మించి, ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా వైఎస్సార్సీకి ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148 ఓట్లకు సమానం. మొత్తం 17 మంది ఓట్లు విలువ   17ని 148తో హెచ్చించిన 2516 ఓట్లన్నమాట. దీనికి జగన్‌, మేకపాటి, సబ్బం హరి ఓట్లు కలిపితే (708 ఇంటు 3) 2124 ఓట్లు. నిన్న గాక మొన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆళ్లనాని, సుజన రంగారావు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించలేదు కనుక వీరు కూడా ఓటు వేయవచ్చు. (2 ఇద్దరు 148) 296 ఓట్లు అన్నమాట. ఇంక కాంగ్రెస్‌లో, వివిధ పార్టీల్లో జగన్‌ అభిమాన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్ర్‌స్‌ కండువా కప్పుకునే ఉన్నా వారు ఫిరాయింపుల చట్టం అడ్డురాదు అని తెలిస్తే ఏ మాత్రం సందేహించకుండా స్వామిభక్తి చాటుకుని సోనియాకు తమ సత్తా తెలుపుతారు.వీరు కాక మరో 30 మంది ఎమ్మెల్యేలు జగన్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు జగన్‌కు ఉన్న రాశ్ట్రపతి ఓట్లు లెక్కెడితే  మొత్తం కలిపితే దాదాపు 5వేల (4,934 )ఓట్లు పై మాటే.
మొత్తం రాశ్ట్రపతి ఓటింగులోని 10,97,012 ఓట్లతో పోలిస్తే ఇది పెద్ద లెక్కపెట్ట తగినదేం కాదు. కానీ, అన్ని ఓట్లు పోల్‌ అయితే కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు తెచ్చుకుని తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అత్తెసరు ఓట్లు కూడా లేవని బాగా తెలుసు.అంటే కాంగ్రెస్‌కు 548506 ఓట్లు కావాలి. కానీ ప్రస్తుతం యుపిఎ2 ఓటు బ్యాంకులో కేవలం 4,50,555 (41.07శాతం)ఓట్లు మాత్రమే ఉన్నాయి.  వీటిలో తృణమూల్‌, డిఎంకెల దగ్గర 11.04 శాతం ఓట్లు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్‌ దగ్గర 3,31,855 (30.3 శాతం)ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కనీసం మూటింట ఒక వంతు ఓట్లు కూడా లేని కాంగ్రెస్‌ ఏకంగా తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిందన్న మాట. యాభైశాతం ఓట్లకు ఎస్‌పికి గాలం వేసినా 47.41 శాతానికే చేరుకుంటుంది. ఇంకా 2.59 ఖాళీ ఉండనే ఉంది. ఇటువంటి దశలో సొంత ఇంటి కుంపట్లు తెలంగాణ కాంగ్రెస్‌ అంటూ, జగన్‌ అంటూ వేరుపడితే పార్టీలు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందే. కనుక కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలకు జగన్‌ కాల యముడే అవుతాడు. అయితే ఇవన్నీ ఊహాగానాలు అని కొట్టిపారేసేవారు లేకపోలేదు. దాదాపు ప్రణబ్‌ గెలుపు ఖాయం అన్న తరుణంలో ప్రణబ్‌కు పోటీగా ఎవరు రంగంలోకి దుగుతారు, ఎవరు దింపుతారు అన్నది ప్రశ్న. కానీ, ఎన్నికలు వస్తే మాత్రం దాదాపు 20 వేల ఓట్లతో జగన్‌ కింగ్‌ మేకర్‌ కావడం ఖాయం.
ఇక జగన్‌ ఓటు ఎలా వేస్తాడు అనే అంశం గమనిద్దాం.
ఒక ఎంపీ ఓటు వేయడానికి ఢిల్లీలో సాధారణ ఏర్పాట్లు జరుగుతాయి. దీనికి విరుద్ధంగా ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా తన ఓటు హక్కు మరో ప్రాంతంలో వినియోగించదలచుకుంటే, పోలింగుకు 10 రోజుల ముందుగా అధికారులకు తెలుపాలి. అయితే, జగన్‌ స్వేచ్ఛగా లేరు కనుక ఆయన పరిస్థితి భిన్నమైంది. జగన్‌ తన ఓటును ప్రాక్సీ (ప్రతినిధి) ద్వారా వేయలేరు. సొంతంగానే వేయాలి. దీనికి నిబంధనల్లో తగిన వెసులు బాటు కల్పించడం జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా జగన్‌ ఓటు వేయగలరు. దీనికి రాశ్ట్ర ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకుని ఫలానా ఎంపి రిమాండులో ఉన్నారని ఎన్నికల అధికారికి తెలుపాలి. వారు జగన్‌ దగ్గరకు వచ్చి చెంచల్‌గూడలో ఓటింగు చేయించుకుని, సీల్‌ చేసి, ఆయన ఓటు ఎక్కడ ఉంటే అక్కడికి (ఢిల్లీకి) పంపుతారు.  ఈ దశలో జగన్‌ పార్టీ చేయబోయే న్యాయపోరాటంపై సిబిఐ ప్రత్యేక దృశ్టిపెట్టి నిపుణలతో చర్చిస్తున్నారని సమాచారం.

source: vaartha

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!