ఢిల్లీ:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కమ్మ కులస్థుల నమ్మడం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యనించారు. బుధవారం సోనియాను కలిసిన తర్వాత ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా కంటే జగన్‌నే క్రైస్తవులు ఎక్కువగా నమ్ముతున్నారని రాయపాటి అన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లోకి వచ్చినా కాపులు జగన్‌కే ఓటేశారని రాయపాటి విశ్లేషించారు. అవినీతి మంత్రులను ఇంకా కొనసాగిస్తే 2014లో పార్టీ భవిష్యత్తు కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వ వైఫల్యమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఎంపీ రాయపాటి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment