ఇడుపులపాయల: రానున్న రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషించనుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో మహానేత వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించిన అనంతరం మేకపాటి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నామమాత్రమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది అని విమర్శించారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటామని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment