అనంతపురం: ఒక పార్టీ అధినేతను ఎన్నికలకు దూరం ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి అరెస్ట్ వెనుక కాంగ్రెస్, టీడీపీ పెద్దల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతోనే వైఎస్ కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
'తనిఖీలతో విజయమ్మని అడ్డుకోవడం తగదు'
రామచంద్రాపురం: తనిఖీల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మని అడుగడుగునా అడ్డుకోవడం తగదని ఆ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆమె ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబులను తనిఖీ చేసే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు.

No comments:
Post a Comment