కాంగ్రెస్, టీడీపీలు అధికార, ప్రతిపక్షాలైతే తమ పార్టీ ప్రజల పక్షమని పలు సర్వేలు చెప్పాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు సోమయాజులు అన్నారు. సానుభూతి వల్లే ఉపఎన్నికల్లో తమ పార్టీకి విజయం లభించిందంటూ జరుగుతోన్న ప్రచారం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మే ఒకటో తేదీన కాంగ్రెస్ జరిపించిన నీల్సన్ సర్వేతోపాటు, పలు పత్రికలతో కలసి సీఎస్ డీఎస్ గత ఏడాది ఆగస్ట్‌లో చేసిన సర్వే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను కళ్ళకు కట్టిందని సోమయాజులు తెలిపారు. జాతీయ ప్రతికలు, చానళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎప్పుడో చెప్పాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతోందని ఆయన వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment