ఒక పక్క విద్యుత్ ను ఆదా చేయండి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు ఇస్తుంటే, మరో పక్క నేతల ఇళ్లకు అవుతున్న విద్యుత్ వ్యయం లక్షలలో ఉంటోంది. ఒక ఆంగ్ల దిన పత్రిక దీనిపై ఆసక్తికర కధనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నెలసరి విద్యుత్ బిల్లు లక్ష రూపాయల పై మాటే. ఇక ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు జూబ్లి హిల్స్ ఇంటి జూలై నెల విద్యుత్ బిల్లు అక్షరాల 84352 రూపాయలుగా ఉంది తర్వాత మంత్రి గల్లా అరుణ ఇంటి విద్యుత్ బిలు అరవై ఐదు వేల వరకు ఉంది. మంత్రులు ముకేష్, దానం నాగేందర్ తదితరుల ఇళ్ల విద్యుత్ బిల్లు నెలకు పదిహేను వేల నుంచి పాతిక వేల వరకు ఉంటోంది.రోడ్లు భవనాల శాఖ ఈ బిల్లులను చెల్లిస్తుంటుంది. నేతల విద్యుత్ బిల్లు పెరిగిపోతుండడంతో నెలకు ఇరవై వేల రూపాయలకు పరిమితం చేస్తే మంచిదని , ఆ పైన ఎవరికి వారు భరించాలని రోడ్లు,భవనాల శాఖ ప్రతిపాదించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. ఏది ఏమైనా నేతలు ముందుగా విద్యుత్ ను ఆదా చేసి , ఆ తర్వాత ప్రజలకు సలహా ఇస్తే మంచిదేమో!
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment