గ్రేటర్ హైదరాబాద్ లో ఈరోజు రాయలసీమవాసులు గర్జించారు. విభజన అనివార్యమైతే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, భూమన్, డాక్టర్ రమణా రెడ్డిలు ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతపై చర్చించారు. సమావేశంలో పలువురు చాలా ఆవేశంగా ప్రసంగించారు. రాయలసీమ వెనుకబాటు తనాన్ని ఎత్తిచూపారు. తెలంగాణవాది దిలీప్ సమావేశంలో పాల్గొని రాయలసీమ ఏర్పాటు ఉద్యమానికి మద్దతుపలికారు.
సమావేశంలో వక్తల అభిప్రాయాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
1. రాయలసీమ జెఎసి ఏర్పాటు చేయాలి.
2. ప్రత్యేక రాయలసీమ సైనిక రెజిమెంట్ ఏర్పాటు చేయాలి.
3. రాయలసీమకు మౌలిక వసతులు పెంచాలి.
4.సీమలో ప్రతి ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరందించాలి.
5. తెలుగుగంగ ప్రాజెక్టుకు అదనంగా 32 టిఎంసిల నీటిని కేటాయించాలి.
6. అనంతపురంలో స్పైస్ సిటీ ఏర్పాటు చేయాలి.
7. మదనపల్లిలో ఐటి పార్క్ ఏర్పాటు చేయాలి.
8. జిల్లాల పునర్విభజన చేసి రాయలసీమలో 9 జిల్లాలు ఏర్పాటు చేయాలి.
కొత్తగా తిరుపతి, నంద్యాల, ప్రొద్దుటూరు, గుంతకల్, హిందూపూర్ జిల్లాలు ఏర్పాటు చేయాలి.
9. తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలి.
10. జనాభా ప్రాతిపదికన రెండు లక్షల 64వేల ఉద్యోగాలు ఇవ్వాలి.
11. సీమలో భూగర్భ జలాలు అడుగంటినందున వంద శాతం మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి.
12. బెంగళూరు-మదనపల్లి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి.
ప్రత్యేక రాయలసీమ కోసం 40 రోజులపాటు 800 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో రాయలసీమపై ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన చాలా ఆవేశంగా ప్రసంగించారు. సీమలోని ప్రతి గ్రామానికి వెళతానని చెప్పారు. సీమకు అన్నిరంగాలలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమవాసులను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. తమ ఆత్మగౌరంజోలికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు. త్యాగానికి మారుపేరు రాయలసీమవాసులని చెప్పారు. రాయలసీమ త్యాగం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. తమ ప్రాంతం పేదరికంలో మగ్గుతున్నాం భరిచామన్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి సహకరించని నేతలందరూ తెలంగాణలో తలదాచుకోవలసిందేనని హెచ్చరించారు

No comments:
Post a Comment