రాష్ట్రపతి ఎన్నిక యూపీఏ ప్రభుత్వంలో చిచ్చు పెట్టే దిశగా కదులుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ ప్రతిపాదించిన అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని ఆది నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తృణమూల్ ప్రతిపాదించిన అభ్యర్థి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పోటీ చేయనని స్పష్ట చేయడంతో మమతకు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకునేందుకు తృణమూల్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే పార్టీ అధినేత్రికి మంత్రులు రాజీనామా లేఖలను అందించారు. అయితే రాజీనామాలను అంగీకరిస్తారో లేదో తెలియదని పార్టీ నేత ముకుల్ రాయ్ అన్నారు. రాజీనామా లేఖను తీసుకున్న మమత.. యూపీఏ ప్రభుత్వానికి మద్దతుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. యూపీఏ ప్రభుత్వంలో తృణమూల్ పార్టీ తరపున ఆరుగురు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment