రాష్ట్ర ప్రభుత్వం జూలై నుంచి అమలు చేయబోతున్న ఎక్సైజ్ విధానం ‘కిరణ్ సీసాలో చంద్రబాబు సారా’ మాదిరిగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ విమర్శించారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన ఇంతటి ముఖ్యమైన విధానాన్ని ప్రకటించడానికి ముందు కనీసం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడంగానీ, ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడ్డంగానీ ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. కొత్త విధానంలో 12 నెలల్లో 2500 కోట్ల రూపాయలు మాత్రమే రాబడి వస్తుందని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 10,800 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వస్తుందని వార్షిక బడ్జెట్‌లో ఎందుకు చూపించారని ప్రశ్నించారు. ఈ మిగతా లోటును ఇపుడు ప్రతిపాదించిన ప్రివిలేజ్ ఫీజు ద్వారా వసూలు చేయదల్చుకున్నారా? వ్యాట్‌ను పెంచుతారా? అని ప్రసాద్ ప్రశ్నించారు.
జేబులు నింపుకొందామనా: ప్రస్తుత ఎక్సైజ్ సంవత్సరంలో 3400 కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటే అది ఇపుడు 2500 కోట్ల రూపాయలు తగ్గించి చూపడం వెనుక అంతర్యం ఏమిటి అని జనక్ ప్రసాద్ ప్రశ్నించారు. లిక్కర్ కింగ్ అయిన బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్ లాలూచీ పడి మిగతా మొత్తాన్ని తమ జేబుల్లో నింపుకోవాలనుకుంటున్నారా అని నిలదీశారు. అబ్కారీ, మద్య నిషేధ శాఖ అని పేరున్నా.. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంపైనే దృష్టి పెడుతోందని, నిషేధాన్ని గాలికొదిలేసిందని ఆయన అన్నారు.

No comments:
Post a Comment