YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 19 June 2012

22న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

 ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత 21వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ రోజున నగరంలో అందుబాటులో ఉండటం లేదని తెలియడంతో మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం 20వ తేదీనే ఈ ఎమ్మెల్యేలంతా ఇడుపులపాయకు వెళ్లి అక్కడ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పిస్తారు. ఆ తరువాత అందరూ హైదరాబాద్‌కు చేరుకుంటారు. 22న మధ్యాహ్నం 12 గంటల తరువాత స్పీకర్ చాంబర్‌లో ప్రమాణం చేస్తారు.

21న లీగల్ సెల్ భేటీ: వైఎస్సార్ కాంగ్రెస్ న్యాయ విభాగ సమావేశం ఈ నెల 21న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరయ్యే ఈ సమావేశానికి పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!