వాన్‌పిక్ భూముల సేకరణలో ప్రజలకు అన్యాయం జరిగింది, సీఎంతో మాట్లాడి ఆ భూములను రైతులకే తిరిగి ఇప్పిస్తామంటూ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉపఎన్నికలకు ముందు వాన్‌పిక్ భూముల రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఆ భూముల్లో ఏరువాక అంటూ పొలం దున్నుతున్నట్లు మంత్రి పోజులిచ్చారనీ, భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు ఇస్తామని చెప్పారనీ గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాన్‌పిక్ సంస్థ భూసేకరణ సందర్భంగా ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలనే మెలిక పెడితే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ డబ్బు వారివద్ద ఇప్పుడు ఉండదు. జనాన్ని మభ్యపెట్టే మాటలు కాదు, భూములు ఇప్పించాలి... అని బాలినేని కోరారు.
కొండా సురేఖకు సముచిత స్థానం
తెలంగాణలో వైఎస్సార్సీపీ నాయకురాలు కొండా సురేఖ ఓడినా గెలిచినట్లే. అక్కడ ప్రత్యేకవాదం ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పరకాల ఉపఎన్నికలో స్వల్ప తేడాతోనే సురేఖ ఓడిపోయారు. ఆమెకు పార్టీలో సముచితస్థానం ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పానన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని బాలినేని తెలిపారు.

No comments:
Post a Comment