ప్రజల వద్దే ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచించారని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. జగన్ ఆదేశాల మేరకు వార్డు బాట చేపట్టానని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని ఆయన తెలిపారు. నిధుల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడితే ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదని ఆ పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment