YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

దేవుడు చూస్తున్నాడు..ధర్మం మనవైపే...

‘‘దివంగత నేత రాజశేఖరరెడ్డి సజీవుడై వచ్చి ఎదురుగా నిలబడితే... ఆయనను విమర్శిస్తున్న మంత్రులు ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా’’.

‘‘ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి నాలుగుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే వైఎస్ ఉన్నప్పుడు నెలకు రెండు చొప్పున సమావేశాలు నిర్వహించి ప్రజాసంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకునేవారు’’.

‘‘ఆ రోజు వైఎస్ నిర్ణయాలపై నోరుమెదపకుండా మంత్రులు ఏం చేశారు. అప్పుడు ఏమీ మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా ఇప్పుడు వైఎస్ సమాధానం చెప్పుకోలేరనే కదా’’
‘‘ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలాచోట్ల వైఎస్ ఫొటోను తొలగించినా నోరుమెదపని మంత్రులు ఇప్పుడు తమదాకా వచ్చేసరికి రకరకాలుగా మాట్లాడుతున్నారు’’.
‘‘ప్రజల పరిస్థితి చూస్తే ఎంతో బాధగా ఉంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది’’.

‘‘దేవుడు చూస్తున్నాడు.. ధర్మం మనవైపే ఉన్నందున ఆయన మనపక్షమే. జగన్ త్వరలో బయటకు వస్తాడు. మళ్లీ మీ మధ్యనే గడుపుతాడు’’. 

జవహర్‌నగర్‌లో జరిగిన బహిరంగసభావేదిక మీద వైఎస్‌విజయమ్మ అన్న మాటలివి. అప్పటి వరకు నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం... ఆమె మాట్లాడే మాటలతో కొన్నిమార్లు నిశ్శబ్దంగా మారింది. కొన్నిసార్లు దిక్కు లు పిక్కటిల్లేలా చప్పట్లు, నినాదాలతో హోరెత్తించారు. వాడీవేడీ మాటలతో సాగిన విజయ మ్మ ఉపన్యాసానికి సభికుల నుంచి భారీ స్పం దన వచ్చింది. ప్రతి మాటను ఆసక్తిగా విన్న ప్రజలు అందులోని అభిప్రాయానికి తగ్గట్టు స్పందించారు. జగన్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించిన తీరుపై మాట్లాడిన ప్పుడు లేచినిలబడి గట్టిగా నినాదాలు చేశారు. వైఎస్ గురించి ప్రస్తావించిన ప్రతీసారి ‘రాజన్న ఆమర్హ్రే’ అంటూ నినదించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!