వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌కు బయలుదేరారు. జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిస్తారు. తర్వాత జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. మరోవైపు గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా రంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment