ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక కేవలం కంటితుడుపు చర్యేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్, మారెప్ప, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రులు ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కూడా నియమించని ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని దళితులు ఎలా నమ్ముతారని వారు ప్రశ్నించారు. దళితులు వైఎస్‌ఆర్‌సీపీకి వెళ్తున్నారనే తూతూ మంత్రం నివేదికను ప్రభుత్వం తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వెంటనే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశ పరచాలని వారు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment