రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
కిరణ్ సర్కారు ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. రైతులకు భరోసా లేదని, రైతు కార్మికులకు ఉపాధి లేక వలసపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అన్నదాత పంట విరామం ప్రకటించినా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలిపారు. ఇరవై లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందన్నారు. సర్ చార్జీలంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ అయిందని వాపోయారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో పడిపోయారన్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు.
అధికార, విపక్షాలు కుమ్మక్కై జగన్ ను టార్గెట్ చేశాయని అన్నారు. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. లేని మహానేతపై కొంతమంది మంత్రులు బురద చల్లుతున్నారని అన్నారు. వైఎస్సార్ తిరిగొస్తే ఆయన కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ఈ మంత్రులకు ఉందా? అని విజయమ్మ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు. ప్రతి సమస్యపై పోరాడాల్సిన అవసరముందని అన్నారు. మళ్లీ వైఎస్సార్ సువర్ణయగం వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. తమ పార్టీలో చేరిన హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులను ఆమె అభినందించారు.

No comments:
Post a Comment