వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 'దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’అని నిన్న విజయమ్మ మంత్రులను సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.
వైఎస్ బతికొస్తే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం మంత్రులకు లేదని శంకర్రావు సోమవారమిక్కడ అన్నారు. మంత్రులు తప్పుచేసి ఆ నెపాన్ని వైఎస్ఆర్ పై నెట్టడం సరికాదన్నారు. వైఎస్ ను విమర్శిస్తే ప్రజలు సహించరని.... ఆయనను దూషించటం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగటం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని శంకర్రావు విమర్శించారు.

No comments:
Post a Comment