చంద్రబాబునాయుడు హయాంలో ఐఎంజీ భారత కంపెనీకి భూకేటాయింపులపై సీబీఐ అనుసరిస్తున్న ధోరణిని హైకోర్టు తప్పుపట్టింది. విచారణ జరపడానికి దర్యాప్తు సంస్థ నిరాకరించడం సరి కాదని హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌తో కూడిన బెంచ్ ముందుకు విజయసాయిరెడ్డి, ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. వనరుల కొరత పేరుతో దర్యాప్తుకు సీబీఐ నిరాకరించటం సరికాదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ, కేంద్ర ప్రభుత్వం, సీవీసీ, హోంశాఖ, ఐఎంజీ భారత కంపెనీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఐఎంజీ భారత అనే అడ్రస్ లేని బినామీ కంపెనీకి హైదరాబాద్లో వేల కోట్ల విలువైన 850 ఎకరాలను కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టడం తెలిసిందే.

No comments:
Post a Comment