YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

జనసంద్రమైన జవహర్‌నగర్

 జవహర్‌నగర్ జనసంద్రమైంది. గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. పాలక, ప్రతిపక్షాలు అడ్డుకున్నా ఏ మాత్రం లెక్కచేయని అభిమానులు విజయమ్మ సభ ప్రాంగణానికి చేరుకునే సమయంలో వేలాదిగా తరలివచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాక సందర్భంగా పార్టీ శ్రేణులు అల్వాల్ నుండి జవహర్‌నగర్ వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేయడంతో రహదారులు కళకళలాడాయి. 

విజయమ్మకు జవహర్‌నగర్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు డప్పులదరువుతో ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన విజయమ్మ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బహిరంగ సభకు తరలివచ్చిన కొందరు వృద్ధులను ‘న్యూస్‌లైన్’ పలకరించగా...రాజన్నను తలచుకుని కన్నీటి
పర్యంతమయ్యారు. 

రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు వైవీ. సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, జనక్‌ప్రసాద్, రాజ్‌సింగ్ ఠాగూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డిలతో పాటు మెదక్ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, ఆ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, గ్రేటర్ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, అన్ని మండలాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఇతర అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డి నిర్వహించారు. 

వైఎస్‌లాంటి ముఖ్యమంత్రిని చూడలేము
నాకు 70 సంవత్సరాలు. గతంలో వృద్ధాప్య పింఛన్ కేవలం 75 రూపాయలే వచ్చేది. అది కూడామూడు నెలలకోసారి. రాజశేఖరరెడ్డి దాన్ని రూ.200లకు పెంచడంతో పాటు ఒకటో తారీకున డబ్బులొచ్చేలా చేశాడు. నాలాంటి ఎందరో వృద్ధులకు అండగా నిలిచిన ఆ మహనీయున్ని ఎప్పటికీ మరువలేం. 
-గూడూరు మల్లయ్య, జవహర్‌నగర్

ఆరోగ్యశ్రీకి ఆద్యుడు..
రోగం వస్తే పెద్దాస్పత్రికి కూడా పోలేని మాలాంటి వారికి ఆరోగ్యశ్రీని ఏర్పాటుచేసి బతికించిన దేవుడు రాజశేఖరరెడ్డి. అలాంటి మహనుబావుడు లేకపోయినా ఆయన రూపంలో జగన్‌ను ఇచ్చాడు. జగన్‌తోనే మాలాంటి పేదలకు ఉచిత వైద్యం అందుతుందని మేమంతా నమ్ముతున్నాం.
- వెంకటలక్ష్మి ,అంబేద్కర్‌నగర్

బతుకుపై భరోసా కల్పించిన మహానేత
నాకు వచ్చే పింఛన్‌తో నెలనెలా రేషన్ బియ్యం, నూనె తెచ్చుకుంటున్నా. దీనికి కారణం ఆ మహనుభావుడే. మాలాంటి ఎందరో పేదోళ్లకు భరోసా కల్పించిన మహానేత వైఎస్సార్. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్‌బాబు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మాలాంటి ముసలోళ్లకు బతుకుపై భరోసా లభిస్తుంది.
- రామగౌడ్, శామీర్‌పేట మండలం

రైతులను ఆదుకున్న దేవుడు 
అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్న సమయంలో స్వయంగా రైతైన రాజన్న సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. రైతేరాజుగా నిలబెట్టిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. ఆయన లేనిలోటు జగనన్నే తీర్చాలి. విజయమ్మను జవహర్‌నగర్ రావడం ఆనందంగా ఉంది. మా మద్దతు ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్‌కే. 
- ఎం.చంద్రయ్య,బాలాజీనగర్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!