విశాఖపట్నం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాల్సిన అవసరం తమకు లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ మరణంపై ప్రజల్లో ఇప్పటికీ చాలా ప్రశ్నలు మిగిలిపోయాయన్నారు. ఆ ప్రశ్నలకు సోనియానే జవాబు చెప్పాలన్నారు. వైఎస్ వల్లే 2 సార్లు రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయని తెలిపారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేకుండా సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ విలువ తెలియదన్నారు. వైఎస్ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. బీహార్, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడా కాంగ్రెస్ ఉండదని చెప్పారు. 26 జిఓలపై ముఖ్యమంత్రి ఎందుకు అధికారికంగా కోర్టులో జవాబు చెప్పడం లేదని కొణతాల ప్రశ్నించారు. |
Tuesday, 29 May 2012
'వైఎస్ మరణంపై మిగిలిపోయిన ప్రశ్నలు'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment