విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిలలను చూడటానికి జనం భారీగా తరలి వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇద్దరూ ఈ రాత్రి 8 గంటల ప్రాంతంలో పాయకరావుపేట చేరుకున్నారు. అప్పటికే ఉప్పెనలా తరలివచ్చిన జనం వారి రాకకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీధులు, మేడలు, మిద్దెలు అన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనమే జనం. ఇసుకవేస్తే రాలని విధంగా జనం ఉన్నారు. మహిళలు అధిక సంఖ్యలో వారిని చూసేందుకు వచ్చారు.
ప్రచార వాహనంపై వారిద్దరితోపాటు పాయకరావుపేట అభ్యర్థి బాబూరావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
ప్రచార వాహనంపై వారిద్దరితోపాటు పాయకరావుపేట అభ్యర్థి బాబూరావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
No comments:
Post a Comment