విశాఖపట్నం: కుళ్లు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి 8 గంటలకు ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించారు. వారికి ఉపయోగపడే పథకాలనే ప్రవేశపెట్టారు. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
ఈ కుళ్లు రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పిలుపు ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే జగనన్నని నిర్ధోషని మీరు నమ్ముతున్నట్లు అర్థం అన్నారు. జగనన్నని బయటకు తెచ్చుకుందాం. ముఖ్యమంత్రిని చేద్దాం అన్నారు. షర్మిల ప్రసంగానికి విశేష స్పందన లభించింది.

No comments:
Post a Comment