ఇడుపులపాయల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నూతనంగా ఎంపికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల చేరుకున్న 15 మంది శాసన సభ్యులు ముందుగా వైఎస్ విజయమ్మను కలుసుకున్నారు. పులివెందులలో స్థానిక నాయకులు శాసన సభ్యులను ఘనంగా సన్మానించారు. ఆతర్వాత పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మతో కలిసి శాసన సభ్యులు ఇడుపుల పాయలకు చేరుకున్నారు. ఇడుపుల పాయకు భారీ ఎత్తున వైఎస్ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు వైఎస్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. జయహో వైఎస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలతో ఇడుపుల పాయల హోరెత్తింది. వైఎస్ అమర్ రహై, విజయమ్మ, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ శాసన సభ్యులు నినాదాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment