గుంటూరుకు చెందిన లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు పార్టీని వీడాలంటూ అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రతీసారి రాయపాటికి సోనియా గాంధీ అన్యాయం చేస్తూనే ఉందని ఆదివారం రాయపాటిని కలిసిన అనుచరులు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్‌గా తిరిగి రెండో సారి కనుమూరి బాపిరాజు నియమించబడ్డ అనంతరం రాయపాటి అనుచరులతో భేటీ అయ్యారు.గతంలో టీటీడీ చైర్మన్ పదవికి కృషి చేసి విఫలమైన రాయపాటికి ఈసారి కూడా ఆ అవకాశం దక్కలేదు. దీంతో రాయపాటి పార్టీ నుంచి వీడాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment