టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు సన్నిహితుడు ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఓబులాపురంలో ఖనిజాలున్న 18 హెక్టార్ల భూమిని ఎస్ఆర్ మినరల్స్‌కు ప్రభుత్వం కేటాయించడాన్ని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథరెడ్డిలు తప్పు పట్టారు. 18హెక్టార్ల భూమిని ఎస్ఆర్ మినరల్స్‌కు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. ఎవరి ప్రయోజనాల కోసం ఈ కేటాయింపులు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఓబులాపురం విషయంలో నానా హడావుడి చేసిన ఓ వర్గం మీడియా ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి ప్రశ్నించారు
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment