రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రలు, కుతంత్రాలతో అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడం తనకు బాధ కలిగించిందని హైదరాబాద్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం ఆయన చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్‌లో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరే విషయంపై చర్చించారు. అనంతరం వడ్డేపల్లి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ రెండుదఫాలు అధికారంలోకి వచ్చి కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కూకట్‌పల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసిన రాజశేఖరరెడ్డి తనను రాజకీయాలలో ప్రోత్సహించారన్నారు. ఓదార్పు చేపట్టినందుకే జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేలా చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై లేని పోని కేసులు పెట్టి జగన్‌ను జైలుపాలు చేయటం అన్యాయమన్నారు. బుధవారం కూకట్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో తనతో పాటు వేలాది మంది వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment