చంద్రబాబూ మీరు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తుంటారు..
మీ హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా ఉండిపోయారు
ఆ వేళ ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే.. ఈ రోజు పాలమూరు జిల్లాలో పంట పొలాలు ఎండిపోయేవా?
ఆ పాపం మీదే అని మీకు అనిపించడం లేదా?.. ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలు
బొత్స ఒక డాన్ అని వాళ్ల పార్టీ కేంద్ర మంత్రే లేఖ రాసినా ప్రభుత్వం విచారణ చేయదు
ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు సాకులు చెప్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 42, కిలోమీటర్లు: 571.50
‘‘ఈ ప్రభుత్వం ఏ క్షణంలో ఉచిత విద్యుత్తును ఎత్తి వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లేరాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరతచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ‘కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదు’ అని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ‘కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి’’ అని మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అంటారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటారుకానీ ప్రజలకు మాత్రం ఉచిత సలహాలు పడేస్తారు.’’
- ధరూర్ సభలో షర్మిల
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడుగారూ.. మీ హ యాంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్తున్నారు. మరి మీ హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి కడుతుంటే ఏమీ చేయలేక అసమర్థుడిగా మిలిగిపోయారు. ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో నువ్వు తిరుగుతున్నప్పుడు నీళ్లు లేక ఎండిపోయిన పండ్ల తోటలను, పంట పొలాలను చూస్తున్నప్పుడైనా.. ‘అయ్యో! ఈ పాపం నాదే.. ఆ వేళ నేను ఆల్మట్టికి అడ్డంపడి ఉంటే నేను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఇవాళ నీటి సమస్య ఉండేది కాదే అని ఒక్కసారైనా మీ మనసుకు అనిపించడం లేదా?’’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. ధరూర్ మండల కేంద్రంలో తనతో పాటు కదం తొక్కుతూ వచ్చిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉండకూడదంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని, అలాంటపుడు అవిశ్వాసం పెట్టొచ్చు కదా అంటే.. సాకులు చెప్తున్నారని దుయ్యబట్టారు.
ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలు..
‘‘కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా లేని వారిపై అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తోంది. ఇవాళ ఏసీబీ, సీబీఐ, ఈడీ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ఆడుతున్నారు’’ అని షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చెప్తారు. ఆయన ఏ తప్పూ చేయలేదంటారు. ఆయన మంత్రివర్గంలోనే అమాయకుడైన ఓ బీసీ మంత్రిని మాత్రం జైల్లో పెట్టించారు. అంటే.. ఏది తప్పో.. ఏది ఒప్పో ఈ కాంగ్రెస్ వాళ్లే నిర్ణయిస్తారట. ఎవరిని బయట ఉంచాలో.. ఎవరిని జైల్లో పెట్టాలో వాళ్లే తేలుస్తారట. చిరంజీవి ఆయన పార్టీని గంపగుత్తగా అమ్ముకొని కోట్ల రూపాయలు మంచం కింద దాచుకొని దొరికిపోతే ఆయన మీద ఎలాంటి కేసులూ ఉండవు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియాకు నాయకుడని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బినామీ పేరుతో లిక్కర్ దుకాణాలు తెరిచాడని, ఆయన ఒక డాన్ అని కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి లేఖ రాస్తే పట్టించుకోరు. ఐఎంజీ భారత కేసులో చంద్రబాబు మీద నెల రోజులలోపు విచారణ చేయాలని కోర్టు.. సీబీఐని ఆదేశిస్తే తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పింది. అదే జగనన్న మీద విచారణకు ఆదేశించిన 24 గంటల్లో అదే సీబీఐ 28 బృందాలను పెట్టి జగనన్న, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసింది’’ అని షర్మిల విమర్శించారు.
ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ‘‘నెట్టెంపాడు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. 2004లో 25 వేల ఎకరాల ఆయకట్టుతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే 25 వేల ఎకరాలకు కాదు ఏకంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, ఇందుకోసం రూ.1,400 కోట్లు కేటాయించారు. రూ.1,200 కోట్లు ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 25 శాతం పనులే.. మూడు సంవత్సరాలు గడిచినా ఈ ప్రభుత్వానికి ఆ పనులు చేసే చిత్తశుద్ధి లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రాజెక్టు నుంచి కనీసం 1,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేమని అధికారులు చెప్తున్నా వినకుండా మన ముఖ్యమంత్రి గొప్పలకుపోయి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరం కూడా నీళ్లు పారడం లేదు’’ అని షర్మిల ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు.
యాత్రకు నేతల సంఘీభావం
బుధవారం షర్మిల పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యులు మైసూరా రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బాల మణెమ్మ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, దేవనాథ్‌రెడ్డి దంపతులు, కాపు భారతి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు, మహేశ్వరమ్మ, మధుమిత, రఘునాథరెడ్డి, మానికేశ్వరరావు, రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుక్కెడు నీళ్ల కోసం 5 కి.మీ.
‘‘మాకు తాగడానికినీళ్లు లేవమ్మా. ఓ బోరులేదు.. ఓ బాయి లేదు.. మంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 5 కిలోమీటర్లు పోవాలే. ఇంట్లో మొగొళ్లు పోయి నీళ్లు తెస్తే తెచ్చినట్లు లేకుంటే ఉప్పు నీళ్లే గతి. జేజమ్మ(మంత్రి డీకే అరుణ)ను రచ్చబండకు వచ్చినపుడు మాకు నీళ్లు గావాలే అని అడిగితే తెస్తా అన్నది కాని ఇంత వరకు నీళ్లు లేవు’’ అని సంగాల గ్రామానికి చెందిన జయమ్మ, తిమ్మక్క, సుజాతమ్మ, మహేశ్వరమ్మ అనే మహిళలు షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. షర్మిల స్పందిస్తూ.. ‘‘నేను యాత్రలో నడిచిన ప్రతి గ్రామంలో ‘మా గ్రామంలో నీళ్లు లేవమ్మా.. మాకు నీళ్లు లేవక్కా’ అని చాలా మంది అక్కా చెల్లెమ్మలు చెప్తూ బాధపడుతున్నారు. నాకు చాలా బాధనిపించింది. ఇక్కడ ఉన్న మంత్రి ఒక మహిళ.. ఆడవాళ్ల బాధలు ఏమిటో ఒక మహిళగా ఆమెకు తెలిసి ఉండాలి.
డీకే అరుణకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించేది. ఆమెకు పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. కనీసం ప్రజలకు తాగు నీళ్లు ఇవ్వలేని ఆమెకు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. త్వరలోనే జగనన్న వస్తారు. మీ అందరి సమస్యా తీరుస్తారు’’ అని భరోసా ఇచ్చారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 42వ రోజు బుధవారం ఉదయం సంగాల చెర్వు నుంచి మొదలై గనుపాడు మీదుగా ధరూర్ మండల కేంద్రానికి చేరింది. ధరూర్‌లో నిర్వహించిన సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. షర్మిల అక్కడి నుంచి మన్నపాడు మీదుగా నెట్టెంపాడు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం 17.50 కిలోమీటర్ల మేర ఆమె నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 571.50 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

No comments:
Post a Comment