మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు కిరణ్ సర్కారు పాతరేస్తుందని షర్మిల విమర్శించారు. రానున్న రోజుల్లో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ నెట్టేంపాడు ప్రాజెక్టు పనులను వైఎస్సార్ 75 శాతం పూర్తి చేశానని మిగతా 25 శాతం పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి తీరిక దొరకడం లేదని దుయ్యబట్టారు.
అన్నిరకాలుగా విఫలమైన కిరణ్ సర్కారుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. కేజీ బేసిన్‌ను చంద్రబాబు హయాంలోనే రిలయన్స్‌కు కట్టబెట్టారని గుర్తు చేశారు. చిరంజీవి హోల్‌సేల్‌గా పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి బంధువుల ఇంట్లో రూ.80 కోట్లు దొరికితే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కేంద్రమంత్రి మద్యం డాన్ అన్న కూడా ఆయనపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. ఏసీబీ, సీబీఐ, ఈడీ, ఐటీలు కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మంత్రిని జైల్లో పెట్టి ధర్మానను మాత్రం కాపాడుతున్నారని తెలిపారు.
జగనన్న బయటికి వస్తాడని షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు. ఉదయించే సూర్యుడిని, జగనన్నను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. కోటి ఎకరాలు సాగునీరు ఇవ్వాలని, గుడిసెలు లేని రాష్ట్రం కావలన్న వైఎస్ కలను జగనన్న నెరవేరుస్తాడని అన్నారు. రూ.3 వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటారని చెప్పారు.

No comments:
Post a Comment