నియోజకవర్గ ప్రజలకు తాగడానికి నీరు కూడా ఇవ్వలేకపోవడం మంత్రి డికె అరుణ గారూ మీకు అవమానంగా లేదా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. గద్వాల్ లో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మంత్రి అరుణ ఒక్కరే బాగా ఉంటే సరిపోదని, నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుంన్నారా? లేదా? చూడాలన్నారు. పనులు పూర్తి కాకపోయినా కల్వకుర్తిని సిఎం ప్రారంభించారు. ఇప్పుడు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పాపం ఈ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. 30ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా వైఎస్ఆర్ పట్ల ఆ పార్టీకి కృతజ్ఞత లేదన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేరుస్తుంటే, ఈ ఎంపీలంతా వేడుక చూసినట్టు చూశారని బాధపడ్డారు. వైఎస్ఆర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా వీరికి అర్హత లేదని చెప్పారు.
ప్రజాసమస్యలపై టిఆర్ఎస్ ఎప్పుడైనా పోరాడిందా ? అని ప్రశ్నించారు. కేసిఆర్‌కు ప్రజాసమస్యలు పట్టవని విమర్శించారు. ఓబులాపురం, బయ్యారం గనులలో తనకు ఒక్క రూపాయి కూడా వాటాలేదని చెప్పారు. అలా నిరూపిస్తే మీరు క్షమాపణలు చెబుతారా? అని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ను షర్మిల ప్రశ్నించారు. మీకు ఒక కూతురు ఉంది, ఆమెపై అబాండాలు వేస్తే మీరు ఊరుకుంటారా? తమపై నిందలు ఎందుకు వేస్తున్నారు? అని ప్రశ్నించారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేనిదీ, వైఎస్ కు, జగనన్నకు ఉన్నది విశ్వసనీయతే అన్నారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని, కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అవిశ్వాసం పెట్టవచ్చని చెప్పారు. అయితే ఆయన పేరుకు బయట తిడుతూ లోపల కుమ్మక్కయ్యారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఈ ప్రభుత్వం ఆయనపై విచారణ చేయదన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీకి భూములు కట్టబెట్టినా దర్యాప్తు చేయరు. అడ్డు తొలగించుకోవడానికి జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టారన్నారు. ఒక్క ఆధారం లేకపోయినా కుమ్మక్కై జైలుపాలు చేశారని చెప్పారు. రెండు పార్టీలూ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని కుట్ర చేశారన్నారు. బెయిలు కూడా రాకుండా ఇంకా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఇన్ని జరుగుతున్నా దేవుడి మీద, మీ మీద జగనన్నకు అపారమైన నమ్మకం ఉందన్నారు. దేవుడు ఉన్నాడు, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఎవ్వరూ ఆపలేరని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.
source:sakshi

No comments:
Post a Comment