మరో ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్రకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన న్యాయవాదులు షర్మిలతో కలిసి అడుగులు కలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని న్యాయవాదులు తెలిపారు. చంద్రబాబు తనకోసం పాదయాత్ర చేసుకుంటున్నారని వారు విమర్శించారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం అల్లీపురం శివారు నుంచి ప్రారంభం అయ్యింది. వేలాదిమంది వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతూ వెంటరాగా షర్మిల 45వ రోజు యాత్రకు ముందుకు కదిలారు. మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, పెదవడ్లమాను, నెల్లికొండిల మీదగా పాదయాత్ర కొనసాగనుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుపై చర్చలో భాగంగా ఆమె సభలో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలన చంద్రబాబు సర్కారుకు కొనసాగింపుగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎస్టీలు అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్టీల అభివృద్ధికి సరైన చర్యలు అవసరమనిఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని విజయమ్మ ప్రశ్నించారు.

No comments:
Post a Comment