కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్, టీడీపీల కుట్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హత్యలు చేసిన వారికి కూడా 3 నెలల్లో బెయిల్ వస్తోందని, 6 నెలలు దాటినా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందని, బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియవన్నారు. ఈనెల 30న జగన్‌కు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీఆర్ పీసీ సెక్షన్ 437 కింద జగన్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment