వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ 44వ రోజు పాదయాత్ర శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అల్లీపురంలో ముగిసింది. ఈరోజు షర్మిల 17 కిలోమీటర్లు నడిచారు. మూలమళ్ల గ్రామశివారు ప్రాంతం నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆత్మకూరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. అల్లీపురం గ్రామంలో షర్మిల రాత్రికి బస చేయనున్నారు. ఇప్పటివరకు షర్మిల 606 కిలోమీటర్లు నడిచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment