వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం బూడిదపాడు గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. బూడిదపాడు శివారు నుంచి యాత్ర మొదలై పెద్దపల్లి, కుర్వపల్లి క్రాస్ ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన గద్వాలలో ప్రవేశించి రైల్వే స్టేషన్ రోడ్, రాజీవ్ మార్గ్‌కు చేరుకొని అక్కడే వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడతారన్నారు. బహిరంగ సమావేశం ముగిసిన అనంతరం రాయచూర్ రోడ్ మీదుగా వెళ్లి ఆ రాత్రికి నోబెల్ స్కూల్ సమీపంలో బస చేస్తారు. మంగళవారం షర్మిల మొత్తం 14.9 కి.మీ యాత్ర చేపడతారని వారు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment