వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన `మరో ప్రజాప్రస్థానం` పాదయాత్రలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నెల్లికొండిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో షర్మిల అక్కడి ప్రజల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయితే బీడీ కార్మికులను ఆదుకుంటారని షర్మిల చెప్పారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తారని చెప్పారు. కరెంట్ కోతలకు సీఎం నిర్లక్ష్యమే కారణమనిన్నారు. వైఎస్ఆర్ కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 70 శాతం పూర్తిచేశారనిన్నారు. మిగిలిన 30శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతోందని షర్మిల విమర్శించారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment