*ఓఎంసీకి బాబు బదలాయింపును సీబీఐ విచారించదేం? *బాబు-కాంగ్రెస్ చీకటి ఒప్పందానికి ఇదే నిదర్శనం
చంద్రబాబు హయాంలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. అయినా సరే.. బాబు అవినీతి, అక్రమాలు కేంద్రానికి గానీ, దాని కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐకి గానీ పట్టవు! కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందమే ఇందుకు కారణమనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఓబుళాపురంలో గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓఎంసీకి మొదట ఇనుప ఖనిజ లీజును బదలాయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబే. దాన్ని రామ్మోహన్‌రెడ్డి నుంచి ఓఎంసీకి బదలాయిస్తూ బాబు సర్కారే 2002 ఫిబ్రవరి 18న జీవో నంబర్ 80ని జారీ చేసింది. తర్వాత కొన్ని నెలలకే గాలి జనార్దనరెడ్డి ఆ సంస్థలో చేరారు.
ఓఎంసీకి తానెలాంటి ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ మాత్రం ఆ సంస్థకు గనులు దోచిపెట్టారని చంద్రబాబు ఎన్నోసార్లు ఆరోపించారు. కానీ నిజానికి ఓఎంసీకి చంద్రబాబే 64.2 ఎకరాల లీజును బదలాయించారంటూ 2011 నవంబరు 4న సీబీఐకి జగన్ స్పష్టంగా వివరించారు. అందుకు సంబంధించి ఆధారాలనూ సమర్పించారు. జీవో కాపీలను మీడియాకు కూడా అందజేశారు. ఓఎంసీ వ్యవహారంలో బాబే తొలి ముద్దాయి గనుక ఆయనను కూడా ఈ కేసు విచారణ పరిధిలో చేర్చాలని అప్పట్లో సీబీఐ జాయింట్ డెరైక్టర్‌కు ఆధారాలతో సహా జగన్ లేఖ సమర్పించారు.
గాలి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రచారం చేయలేదా? 1999లో కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి సుష్మా స్వరాజ్, అసెంబ్లీ స్థానం నుంచి శ్రీరాములు బీజేపీ తరఫున పోటీ చేసిన సందర్భంగా గాలి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోనే చంద్రబాబు అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఎమ్మార్ కేసులోనూ అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున విలాసవంతమైన బంగళాలు కట్టుకుని అమ్ముకునేదానికి, గోల్ఫ్ కోర్టులు కట్టుకోవడానికి ఎకరా నాలుగు కోట్ల పై చిలుకు చేసే భూమిని అన్ని నిబంధనలను కాలరాసి అడ్డగోలుగా, కారుచౌకగా, ఉచితంగా ఎమ్మార్‌కు బాబు సర్కారు కట్టబెట్టింది. అయినా ఆయనపై సీబీఐ విచారణ జరపదు.
*ఎకరాకు రూ. 29 లక్షలు వెలకట్టి ఎమ్మార్‌కు భూములు కట్టబెట్టిన బాబు, అంతకు మూడేళ్ల క్రితమే అదే ప్రాంతంలో తన భార్య పేరిట ఉన్న భూమిని ఎకరా కోటి రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు విక్రయించారు. అక్కడి ప్రభుత్వ భూమికి ధరను పెంచాల్సింది పోయి మరింత తగ్గించినా.. చెనక్కాయలకు, బెల్లానికి కేటాయించిన చందంగా కట్టబెట్టినా సీబీఐ ఆయనవైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందమే కారణమన్నది బహిరంగ రహస్యం.
ఎల్లో మీడియా దృష్టికి రావా? * ఓఎంసీకి తొలుత ఓబుళాపురంలో హైగ్రేడ్ మైనింగ్ లీజు బదలాయించింది, ఎమ్మార్‌కు అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టింది చంద్రబాబేనని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం ఎన్నడూ వాటిని పొరపాటున కూడా ప్రస్తావించదు. టీడీపీ అధినేత-ఎల్లో మీడియా అనుబంధమే అందుకు కారణం. బాబు జీవోపైనా దర్యాప్తు జరుపుతామని అప్పట్లో మీడియా సమావేశంలో ప్రకటించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ... అందులో ఏమీ లేదని, విచారణ జరపాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చేశారు! |
No comments:
Post a Comment