తన రెండో రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగిస్తానని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ రోజు వైఎస్సాఆర్‌సీపీలో చేరిన అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. తనకు, తన అనుచరులకు పార్టీ సభ్యత్వం కావాలని సిగ్గు విడిచి అడిగినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఆరు నెలలు మనస్తాపం చెంది ఏ పార్టీలో చేరకుండా ఉన్నానన్నారు. తన అనుచరులతో మాట్లాడిన అనంతరం వైఎస్సార్‌సీపీ చేరినట్లు తెలిపారు. చిరంజీవి, తాను 12 ఏళ్లు పక్కపక్క ఇంట్లో ఉన్నా, ఆయన పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ జైల్లో కలవడం తనకు మంచి అనుభూతి కల్గించిందని, రాష్ట్ర సమస్యలపై జగన్‌కు అవగాహన ఉందని వెంకటేశ్వర్లు అన్నారు. |
source:sakshi
No comments:
Post a Comment