Saturday, 1 December 2012
Chief Minister Jaganmohan Reddy by 2014, says Roja
షర్మిల పాదయాత్రకు లభిస్తోన్న ఆదరణను చూస్తేనే వైఎస్ఆర్‌పై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. షర్మిలతో కలిసి 44వ రోజు పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. షర్మిల అడుగులో అడుగేసే ప్రతి ఒక్కరూ కుమ్మక్కు, నీచ రాజకీయాలను చీల్చి చెండాడే యోధులు అని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్‌ఎస్ నాయకులు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించడంలేదన్నారు. ప్రజలు కోరుకున్న వాళ్లే నాయకులు అవుతారని విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాలేరన్నారు. వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉండి మనోధైర్యమిస్తున్న ప్రజలకు రోజా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment