వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సిబిఐ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. ఈరోజు ఆయన ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీబీఐ మాన్యువల్ ను కూడా అధికారులు పట్టించుకోవడం
లేదన్నారు. ఆరునెలలైనా జగన్ కు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ విషయంలో సిబిఐ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కూడా సిబిఐ పట్టించుకోవడం లేదన్నారు.
జిఓలు అన్నీ సరైనవే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అలాంటప్పుడు క్విడ్‌ప్రోకో ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. జిఓలు సరైనవని కోర్టుకు ఎందుకు తెలియజేయరని ఆయన అడిగారు.
జగన్ బెయిల్ కోరినా సిబిఐ జేడీ సమయం కోరడం సరికాదన్నారు. సీబీఐ అధికారులు యూపీఎస్ సి ద్వారా నియమితులయ్యారా? లేక రాజకీయ పార్టీ నేతల ద్వారా ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టులో జగన్దే అంతిమ విజయం అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ పై ఎన్నికుట్రలు చేసినా ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రేపు సుప్రీంకోర్టులో క్విడ్ప్రోకో లేదని ప్రభుత్వం చెబితే అక్షింతలు వేసి జగన్ కు క్షమాపణ చెప్పి ఇంటికి పంపించవలసి ఉంటుందన్నారు.
source:sakshi

No comments:
Post a Comment