రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. ఐదేళ్లు పాలించాలని కాంగ్రెస్‌కు ప్రజలు తీర్పు ఇచ్చారని, మంచిపాలనో, చెడ్డపాలనో వారి తీర్పును గౌరవించాలన్నారు. లేదంటే ప్రజా తీర్పును అవమానపరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే లింగారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment