Saturday, 1 December 2012
Ambati Rambabu fire on Congress,TDP
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్న చంద్రబాబు అదే పార్టీ దెబ్బకు హెలికాప్టర్లు వదిలేసి పాదయాత్ర మొదలుపెట్టారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే గుండె దడ పట్టుకున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో పెద్ద దెబ్బ చూపించబోతున్నామని అన్నారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయని.. హెలికాఫ్టర్ ప్రమాదంపై త్యాగి ఇచ్చిన నివేదికను తాము ఖండిస్తున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment