
12 సంవత్సరాలుగా ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న నీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆమెరికా నుంచి కొడుకు, కూతురుని పిలిపించుకుని పోస్టులు అప్పజెప్పితే తప్పు లేనిది విజయమ్మ, షర్మిల బయటకు వస్తే తప్పా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని చెబుతున్నారు.. నెల రోజులు ఢిల్లీలో మకాం వేసి చివరకు అఖిలపక్షమైనా పెట్టించగలిగారా అని నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది పార్టీని విలీనం చేయడానికి కాదు.. ప్యాకేజీ మాట్లాడుకోవడానికి అని మండిపడ్డారు. దీనిని తెలంగాణ ప్రజలు గ్రహించాలని సురేఖ కోరారు. తెలంగాణ ఎలా తెస్తావో ఏ ఒక్కరికైనా విడమరిచి చెబుతున్నావా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఐదేళ్ల పాలనను చూసిన ప్రజలు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని రెండోసారి గెలిపించారని పేర్కొన్నారు. ఆయన మరణించిన నాటినుంచి ఏ వర్గానికి చెందిన ప్రజలూ ప్రశాంతంగా నిద్రపోలేదని వాపోయారు. పదవులు ఎలా కాపాడుకోవాలా? అని అధికార పార్టీ, ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టాలా అని ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్నాయని విమర్శించారు.
source:sakshi
No comments:
Post a Comment