వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సతీమణితో సహా వచ్చి మంగళవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకున్నారు. తాను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అభిమానిననీ తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు సిర్పూరు నియోజకవర్గం అభివృద్ధికి వై.ఎస్ ఎంతగానో సహకారం అందించారనీ ఆయన కుటుంబం వేధింపులకు గురవుతున్నపుడు వారికి మద్దతు ప్రకటించడం కనీస ధర్మమని భావించి విజయమ్మకు మద్దతు ప్రకటించాననీ కోనప్ప ఆ తరువాత వెల్లడించారు.
కోనప్పతో పాటు విజయమ్మను కలిసిన వారిలో కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గణపురం శ్రీనివాస్, దహేగాం మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిలువేరు సత్యనారాయణ ఉన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సాయంత్రం విజయమ్మను కలుసుకున్నారు. వై.ఎస్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలున్నాయనీ విజయమ్మ తనకు సోదరిలాంటిదని అందుకే ఆమెను కలిసి తన సానుభూతి తెలిపానని రామకృష్ణారెడ్డి చెప్పారు.

No comments:
Post a Comment