దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, అందువల్లే ఆయన పట్ల ముస్లిలంతా గౌరవంతో ఉన్నారని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో వాదించే విషయంలోనూ అటర్నీ జనరల్ రాకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడం అసంతృప్తిగా ఉందని చెప్పారు. ఈ విషయంలో కోర్టు సరిగా అధ్యయనం చేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ లాంటి పార్టీలన్నీ ఇప్పుడు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా, విద్యాపరంగా ముస్లింలు వెనకబడి ఉన్నారని ఆయన తెలిపారు. రూల్ ఆఫ్ లా ప్రకారం వారికి రిజర్వేషన్లు దక్కాల్సిందేనన్నారు. శాసనసభలో అవిశ్వాసం చర్చకు వస్తే ముందు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎంఐఎం స్పందిస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు అభివృద్ధిని, రక్షణను కోరుకుంటున్నారన్నారు. ఈ రెండు అంశాలు అమలు చేసిన పార్టీలకే ముస్లింలు ఓటేస్తారని చెప్పారు. కాంగ్రెస్ తో సంబంధాల విషయంలో ఆయన స్పష్టత ఇవ్వలేదు.

No comments:
Post a Comment