అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలు ఏవి? అని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ప్రభుత్వం వారి అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందా? అని ఆమె ప్రశ్నించారు. 26 వివాదాస్పద జీ వోలు ఇచ్చిన వారిని ప్రభుత్వం కాపాడేయత్నం చేస్తోందన్నారు. మంత్రులపై చర్యలు తీసుకోకపోవడమే సిబిఐ అధికార దుర్వినియోగానికి నిదర్శనం అన్నారు.
బిజెపి మొదటి నుంచి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అని ఆమె తెలిపారు. ఈ అంశంలో హైకోర్టు తీర్పు హర్షణీయం అన్నారు.
బిజెపి మొదటి నుంచి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అని ఆమె తెలిపారు. ఈ అంశంలో హైకోర్టు తీర్పు హర్షణీయం అన్నారు.
No comments:
Post a Comment